భక్తి రంగంలో వంగపల్లి అంజయ్య స్వామికి అవార్డు అందజేసిన కేపి బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు
కే పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు స్వామివివేకానంద ఐకాన్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం బిర్లా మందిర్ ఆవరణలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మ ప్రచారం ప్రబోధకుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వాస్తవ్యులు వంగపల్లి అంజయ్య స్వామికి భక్తి అవార్డును ప్రధానం చేశారు ఈసందర్భంగా కన్నతల్లి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ వైశ్య కులంలో జన్మించి తన సొంత నిధులతో యాదగిరిగుట్ట సమీప ప్రాంతంలోని కాచారం కైలాసపురంలో దేవాలయాన్ని నిర్మించుకొని భక్తుల సహాయ సహకారాలతో గురుదేవులు శ్రీశ్రీశ్రీ జగేంద్ర మహాప్రభు ని శ్రీ లక్ష్మీ నారాయణ స్వాముల వారి ఆశీస్సులతో ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా పాటుపడుతున్న వంగపల్లి అంజయ్య స్వామికి భక్తి అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమని తెలిపారు