సీఎం సభకు ఏర్పాట్లు* సభాస్థలిని పరిశీలించిన సీపీ విష్ణు వారియర్‌

*సీఎం సభకు ఏర్పాట్లు*

*సభాస్థలిని పరిశీలించిన సీపీ విష్ణు వారియర్‌,మంత్రి పీఏ కిరణ్‌*

*నేడు మంత్రులు హరీష్‌ రావు,పువ్వాడ అజయ్‌ పరిశీలన,సమావేశం*

*ఖమ్మం:* టీఆర్‌ఎస్‌ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత తొలి బహిరంగ సభ ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌,మంత్రి పువ్వాడ పిఏ రవికిరణ్‌ పరిశీలించారు.కేసీఆర్‌ కదన శంఖారావం పూరించనున్న సభ కావడంతో భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు రానున్నారు.మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కావడంతో 100 ఎకరాల్లో సభ స్థలి ఏర్పాటు చేస్తున్నారు.దానితో పాటు 50 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఖమ్మం గుమ్మం నుంచే భారత నగారా మోగనున్నది. తెలంగాణ ఉద్యమం మొదలైనచోటు నుంచే దేశ గుణాత్మక మార్పునకు భారత రాష్ట్ర సమితి అధినేత,ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించనున్నారు.ఈ బహిరంగసభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఖమ్మం ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలు ఉన్నారు.అందులో భాగంగా బుధవారం మంత్రులు తన్నీరు హరీష్‌రావు,పువ్వాడ అజరు కుమార్‌ సభ స్థలి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహిస్తారు.

Leave A Reply

Your email address will not be published.