ద్రాతృత్వం చాటుకున్న యువ నాయకుడు NC సంతోష్ గుప్తా

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం 18 వ వార్డ్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జమల్ పూర్ శేఖర్ అనే యువకునికి ఉపాధి కోసం బిఆర్ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యక్షులు నేతి చిన సంతోష్ గుప్త స్వంత ఖర్చులతో నాలుగు చక్రాల తోపుడు బండి అందజేసి ద్రాతృత్వం చాటుకున్నారు ఈసందర్భంగా నేతి సంతోష్ గుప్తా మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాల మార్గం అన్వేషించాలని ఉపాధి కోసం మిత్రులద్వారా జమీల్పూర్ శేఖర్ కుటుంబ పరిస్థితి తెలుసుకుని వారికి మావంతు సహాయం అందజేయడం జరిగిందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో,కొమరవెల్లి ప్రవీణ్, బిక్షపతి,సంపత్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.