కారు ప్రమాదానికి గురైన ఆర్టీసీ ఎండీ vc సజ్జనార్ ప్రమాదంలో స్వల్ప గాయాలు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కారు ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి సజ్జనార్ హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా హైవే మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో రామగుండం మండలం మల్యాల పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.

Leave A Reply

Your email address will not be published.