కాచారమ్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మహర్నవమి పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) లో మంగళవారం మహర్నవమి పురస్కరించుకొని ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రతేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయ్యప్ప దేవాలయం మాజీ చైర్మన్ కాచం చంద్రమౌళి గుప్త హాజరు అయ్యారు కైలాసపురం అన్నసత్రం సిద్దిపేట వాసుల ఆధ్వర్యంలో ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తి అయి దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన మహా ప్రసాదాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సందర్భంగా అంజయ్య స్వామిని సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ సేవాసమితి భర్త బృందం కిరణ్,సంతోష్,తిరుపతి అభినందించారు, పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు కీర్తి శేషులు కాచం వెంకటేశం వజ్రమ్మ పేర్ల మీద వారి కుమారులు కాచం రాజేశం, బీమేశం, కాశీనాథం,చంద్రమౌళి, సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.