కార్మిక శాఖ మంత్రిని కలిసిన కాప్రా మున్సిపల్ కార్మిక సంఘం నాయకుడు కురుమన్న ముదిరాజ్

కార్మిక శాఖ మంత్రిని కలిసిన కాప్రా మున్సిపల్ కార్మిక సంఘం నాయకుడు కురుమన్న ముదిరాజ్

కాప్రా డివిజన్ పారిశుద్ధ కార్మిక నాయకుడు కురుమన్న సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని మరియు మల్కాజిగిరి పార్లమెంటు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అత్యవసర సేవలలో ముఖ్యమైన పారిశుద్ధ కార్మికులకు కార్మికుల దినోత్సవం మేడే రోజు కూడా సెలవు ఇవ్వకపోవడం చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని ముఖ్యమైన పండుగ రోజులలో కూడా ఉదయం 9 గంటల లోపు పారిశుద్ధ్య పని ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పండగ చేసుకునే విధంగా అనుమతించాలని ప్రస్తుత అధిక ధరలతో కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతి కార్మికులం అయిన మాకు కనీస వేతనం 26,000 అందేలా చూడాలని ఇండ్లు లేని మున్సిపల్ కార్మికులకు డబల్ బెడ్ రూమ్ మంజూరయ్యే విధంగా ప్రయత్నం చేయాలని మరియు మరియు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత మున్సిపల్ ఉద్యోగులుగా గుర్తించాలని మా సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా సహకరించాలని కోరుతూ తమ సమస్యలను వివరిస్తూ మెమోరాండం సమర్పించారు కార్యక్రమంలో కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.