*10 ఎమ్మెల్యే,2 ఎంపీ సీట్లు సోనియాకి గిఫ్ట్ గా ఇస్తాం:రేణుకా చౌదరి

*10 ఎమ్మెల్యే,2 ఎంపీ సీట్లు సోనియాకి గిఫ్ట్ గా ఇస్తాం:రేణుకా చౌదరి*

*ఖమ్మం:* తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి.రాబోయే ఎన్నికల్లో హోరాహోరా పోటీ ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు అంచనాకి వచ్చాయి.ఎప్పుడైనా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి మంచి ఓటుబ్యాంకు ఉంటుంది.తాజాగా మాజీ ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ,రెండు పార్లమెంట్‌ సీట్లు గెలుస్తామని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రేస్‌ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.ఖమ్మం నగరంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అందరూ గమనించాలన్నారు.గత ఎన్నికల్లో 4లక్షల ఓట్లు వచ్చాయి అంటే ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 10కి 10సీట్లు గెలుచుకుంటాం అన్నారు.చాలా మంది కాంగ్రెస్ లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు.అనుక్షణం కార్యకర్తలకు,ప్రజలకు అండగా ఉంటాం అన్నారు. అన్ని పార్టీలు ఖమ్మం వైపు చూస్తున్నాయి.
ఖమ్మం జిల్లా ముమ్మాటికీ కాంగ్రెస్ జిల్లా ఖమ్మంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంగతి చూస్తాం.20కోట్లతో బస్ స్టాండ్ కడితే.అది స్విమ్మింగ్ ఫూల్ లా మారింది ఇది ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారు.ఈ రోజు నుంచి జిల్లాలో రాజకీయంగా ఫోకస్ చేస్తున్నాం.మేము ఉన్నామని నమ్మకం ఇస్తున్నాం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యేలు,2 ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తామన్నారు రేణుకా చౌదరి.

Leave A Reply

Your email address will not be published.