పార్టీ మారాక గొంతు ఎత్తుతా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

*కేటీఆర్‌తో చనువు వల్లే బీఆర్ఎస్‌లో వున్నా..పార్టీ మారాక గొంతు ఎత్తుతా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

రైతుగా వ్యవసాయం చేసిన తాను,చిన్న కాంట్రాక్టర్‌గా, తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదిగానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మంగళవారం ఖమ్మంలో కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….. భగవంతుడి దయతో కాంట్రాక్టర్‌గా నాలుగు రాళ్లు సంపాదించుకున్నానని ఆయన చెప్పారు.డబ్బే మనిషికి ముఖ్యం కాదని వంద కోట్లు సంపాదించిన తర్వాత డబ్బుకున్న విలువ పోతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానని ఆయన గుర్తుచేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో ఆనాడు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానని పొంగులేటి తెలిపారు.పినపాకలో నీకేం పని అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.పినపాకకు తాను ఇప్పుడే రాలేదని రాజకీయాల్లోకి వచ్చినరోజే వచ్చానని తెలిపారు.పాయం వెంకటేశ్వర్లుని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే బీఆర్ఎస్‌లో చేరారని పొంగులేటి తెలిపారు. తర్వాత కాలంలో కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మాటమీద బీఆర్ఎస్‌లో చేరామని ఆయన పేర్కొన్నారు.పార్టీ మారిన తర్వాత తనకు ఏం జరిగిందో సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.కేటీఆర్‌తో వున్న చనువుతో టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అయ్యామని ఆయన పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో అందరం కలిసే పోటీ చేస్తామని శీనన్న మీతోనే వుంటాడని, మీకోసం నడుస్తాడని పొంగులేటి చెప్పారు. కష్టాలు చెప్పుకుంటేనే మీరు ఉలిక్కిపడుతున్నారని కష్టాలు పడ్డ మేము ఎంత బాధ అనుభవించి ఉండాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.మీరు అధికార మదంతో రెచ్చిపోయినా ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన జోస్యం చెప్పారు.నేను అడిగితే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదని ఇప్పుడు సెక్యూరిటీ తగ్గించినా తాను అడగనని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఉన్న ఇద్దరు గన్‌మెన్లను సైతం వెనక్కి తీసుకోవాలని తాను భూదందాలు చేయలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.గొంతు ఎత్తకుండా తాను ఉండలేనని పొంగులేటి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.