నుమాయిష్‌ సందర్భంగా రెండు కారిడార్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు

అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో

హైదరాబాద్‌: నాంపల్లిలో నుమాయిష్‌ ప్రారంభమైన సందర్భంగా మెట్రో రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించి, అర్ధరాత్రి 12 వరకు నడుపుతున్నారు. టర్మినల్‌ స్టేషన్లయిన ఎల్బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకే చివరి మెట్రో సర్వీసులు బయలుదేరి వెళ్లిపోతాయి. నుమాయిష్‌ ముగిసే వరకు చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.మియాపూర్‌-ఎల్బీనగర్‌(రెడ్‌ లైన్‌), నాగోల్‌ నుంచి రాయదుర్గం(బ్లూ లైన్‌) కారిడార్లలో మాత్రమే పొడిగింపు ఉంటుందని తెలిపారు.
నుమాయిష్‌ నడిచినంత కాలం గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో ఉండే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పుడున్న 4 టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచారు.
4.57 లక్షల మంది.. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబరు 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు నడిచిన విషయం విదితమే. మొత్తంమీద 4.57 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరి 1 ఆదివారం కావడంతో మెట్రోలో భారీగానే ప్రయాణించారు.

Leave A Reply

Your email address will not be published.