జగ్గయ్యపేట పట్టణం అయ్యప్ప నగర్ నందు 17.75 లక్షల రూపాయలతో ది కృష్ణ రైతు సేవా సహకారం సంఘం భవన ఆధునీకరణ ప్రారంభోత్సవం మరియు డివిడెంట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులుసామినేని ఉదయభాను .*_
_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకార సంఘం,వ్యవసాయం రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు,చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను ఇబ్బందులకు గురిచేసి వ్యవసాయం దండుగా అంటూ అవహేళన చేసి రైతులను అవమానపరిచాడని అన్నారు,అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు పలు పథకాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తూ ఆయన రెండు అడుగులు ముందుకు వేస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తూ వ్యవసాయ రంగాన్ని అనూహ్య రీతిలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు._
_వ్యవసాయ రంగంలోనే విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందని తెలిపారు._
_నేడు ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడ తర్వాత ఎక్కువమంది సభ్యులతో అతిపెద్ద సొసైటీగా జగ్గయ్యపేటలోని కృష్ణా ఫార్మర్స్ సొసైటీ నిలవడం గర్వకారణం అని కొనియాడారు,అదేవిధంగా నేడు నేడు 35 లక్షల రూపాయలు డివిడెంట్లు సభ్యులైన రైతులకు అందజేయడం శుభపరిణామం అని తెలిపారు.తదితర రుణాలకు సంబంధించి ఒక కోటి మూడు లక్షల రూపాయలు రైతు నేస్తం,కర్షకమిత్ర,పంట రుణం ద్వారా రుణాలను రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు._
_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,మార్కెట్ యార్డ్ చైర్మన్ ముత్తినేని విజయ్ శేఖర్,మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బాలమ్మ, కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు తూమాటి నాగేశ్వరరావు,మాజీ సొసైటీ అధ్యక్షులు కుందవరపు కొండయ్య,మండల పార్టీ అధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాస్,ఎస్టి విభాగం అధ్యక్షులు బద్దు నాయక్,కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాబు,వివిధ గ్రామాల నాయకులు,రైతు సోదరులు,కేడీసీసీ బ్యాంకు డీజీఎం శ్రీనివాసరావు,ఏజీఎం శ్రీదేవి,బ్యాంకు మేనేజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు._