ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేదా?
*విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్న.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదా అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. విజయవాడలో దాసరి భవన్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కోసం 16 రోజుల పాటు జరిగే బస్సు యాత్ర హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు జరుగుతుంది అని,యాత్రకు నవతరంపార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది అన్నారు. అనంతరం కొత్తగా ప్రభుత్వం తెచ్చిన జీవో.ఆర్టీ1 ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ, సీపీఎం వి శ్రీనివాసరావు,తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ,ప్రొఫెసర్ విశ్వనాధ్, సీపీఐ సుభాని, శివారెడ్డి, అశోక్ ,విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.