కొత్త ఇంట్లో పూజలు ఎందుకు చేస్తారు..?

భారతదేశం నిగూఢమైన శక్తి యుక్తులను శోధించి వాటిని సశాస్త్రీ యంగా నిరూపించింది. అందుకే కొన్ని విద్యలు కాలగర్భంలో కలి సిపోయినా వాటి ఆచారాలు, సంప్రదాయాలు మన జీవన శైలిలో మిగిలిపోయాయి. అలాగే భారతీయ ఋషులు ప్రకృతిని పరిశోధించి అందని అజ్ఞాతశక్తిని కనుగొన్నారు. శక్తికి రూపంలేదు అని తెలుసు మనకు. కానీ అది పనులు చేస్తుంది. ఫలి తాలు ఇస్తుంది.

సూర్యుని శక్తిని సోలార్ ప్లేట్లలో నిక్షిప్తం చేసి కరెంట్ గా మనం నేడు వాడుకుంటున్నము . అలాగే మనిషిలోని, అన్నయమ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు విశ్వాత్మశక్తితో కూడుకొని ఉంటాయి. ప్రాణాణువులు చేసే అద్భుతం అందరికీ అర్థం కావు.
అట్టి శక్తి నిజాయితీ, స్వార్థపు ఆలోచనలేని సాధువులు స్వామీజీలు అంతరంగాలలో నెలకొని ఉంటుంది. అట్టి ప్రాణకాంతి విశ్వశక్తి సద్భావన, నరముల చేతి వేళ్ల చివరి కొసల నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. తద్వారా కలిగే ప్రేరణ వారి భావనలు మన మనస్సు. లను మానసిక మలిన రహితులను చేస్తుంది. ఇక్కడ విశ్వాసమే ప్రధానం. ఈ రోజుల్లో అంతటి మహాశక్తిగల ఋషుల వారసులు కనుమరుగు అయ్యారేమో కానీ సద్భావనా పరుల సంకల్పం, మనం బాగుపడాలనే వారి మాట తప్పకుండా ఆ గృహస్తుల వైభవానికి మార్గం సుగమం చేస్తుంది.

మానవుని వెన్నుపాము చివర మూలాధారంలో అలాంటి గొప్పశక్తి దాగున్నది. దానిని యోగ సాధనతో సాధించవచ్చన్నదే మన ఋషుల ఆవిష్కరణ. అలా మహాత్ముల చేత మన గృహాలలో పూజలు చేయించి వారి దీవెనలు పొందాలన్నది మన పూర్వీకులు తెలియజెప్పారు కాబట్టి అదే ఆనవాయితీని ఇప్పటి తరం కూడా కొనసాగిస్తోంది.
ప్రచారకులు** వంగపల్లి అంజయ్య స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
కాచారం కైలాసపురం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం

Leave A Reply

Your email address will not be published.