తెలంగాణ మహా కుంభమేళా గిరిజన ఆదివాసీ మేడారం జాతర…

ములుగు ఫిబ్రవరి 16: అడవి జనసముద్రంగా మారింది. లక్షలాది భక్తజనం..తమ గుండెల్లో కొలువైన వన దేవతల నిజ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. సమ్మక్క సారాలమ్మల జాతర అరుదైన జాతర. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర. కొయా గిరిజన సాంప్రదాయాలతో కుంకుమ బరనే ఆదిశక్తి స్వరూపాలుగా బెల్లం బంగారంగా తల్లులకు సమర్పించే అరుదైన జాతర. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ద్య పౌడ్యమి రోజు జాతర ప్రారంభం అవుతుంది. రాష్ట్రం తో పాటు చతిస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర పొరుగు రాష్ట్రాల నుండి కోటికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుంటారు. తల్లుల రాక మేడారం గ్రామానికి నూతన తేజాన్ని ఇస్తుంది.

ప్రతి రెండేళ్లకోకసారి జరిగే ఈ జాతరకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణకు ఏర్పాట్లకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు మంజరి చేసి తాత్కాలిక , శాశ్వత పనులు చేపట్టింది. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాటు తదితర అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటు ఏర్పాట్లను విస్తృత పరిచారు.

భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యత్రంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు. జాతర విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు ముందు ఏర్పాట్ల పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం జాతరకు ఇచ్చిన ప్రాముఖ్యత స్పష్టం అవుతోంది. చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, మంత్రులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు పర్యటించి వివరాలను తెలుసుకున్నారు. మొత్తంగా భక్తులకు అసౌకర్యం లేకుండా మేడారం ను ముస్తాబు చేశారు. వాహనాల పార్కింగ్ స్థలాలు గద్దెల కు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు , రవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో యంత్రాంగం సఫలీకృతులయ్యారు. బుధవారం ఉదయానికే ఇప్పటికే 10 లక్షల మంది మేడారం వచ్చి గుడారాలు వేసుకొని ఉన్నారు. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్, రెడ్డి గూడెం తదితర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ జాతరకు కోటి ఇరవై లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ప్రభుత్వ అంచనా.

Telangana Maha Kumbh MelaTribal Medaram Fair
Comments (0)
Add Comment