నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

  • ప్రత్యేక విమనాంలో బేగంపేటకు..
  • హెలికాప్టర్‌లో నేరుగా ఇక్రిశాట్‌ ‌స్వర్ణోత్సవ వేడుకులకు
  • సాయంత్రం ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ
  • ప్రధాని రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎస్పీజీ

ఫిబ్రవరి 4 : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒకరోజు పర్యటనకు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 7వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు చేరుకుని స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో నేరుగా ముచ్చింతల్‌ ‌వెళ్లి అక్కడ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీ రాక సందర్భంగా..శ్రీరామనగరంలో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యాధునిక కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని భద్రతా చర్యలను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు..ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో పలుసార్లు సక్షించారు. శ్రీరామనగరంలో కార్యక్రమం ముగిశాక శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి మోదీ..రహదారి దుగా చేరుకుంటారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటన దృష్ట్యా..పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ వెళ్లే సమయంలో ఆ రహదారి దుగా ఇతర వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ప్రధాని కార్యక్రమంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌.. ‌డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. 5న మధ్యాహ్నం 2 :45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు.

ఇక్రిశాట్‌ 50 ‌స్వర్ణోత్సవాల కార్యక్రమంలో లోగోను ప్రారంభించిన అనంతరం ప్రధాని సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్‌ ‌సపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్‌ ‌ద్వారా చేరుకుంటారు. అక్కడ రామానుజచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ ‌నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాని ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆ‌శ్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్‌పిజి టీమ్‌ ఆ‌శ్రమాన్ని సందర్శించింది. ఢిల్లీ నుంచి వొచ్చిన ఎస్‌పిజి అధికారులు ఆశ్రమంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అంతే కాకుండా ప్రధాని ఏయే ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుందనే వివరాలను కూడా సేకరించారు. చిన జీయర్‌ ‌స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశించారు.

ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌ ‌నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్‌ ‌ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. వేదికల వద్ద తగు వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. ముచ్చింతల్‌ ‌పరిసర ప్రాంతాలలో నిరంతరాయంగా విద్యుత్‌ ‌సరఫరా చేయాలని విద్యుత్‌ ‌శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్‌ ‌విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌పనిచేయనుంది. ఎస్‌పిజి పాటు ఆక్టోపస్‌, ‌ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు నిరంతరం నిఘా సారిస్తున్నారు.

Modi Arriving To HyderabadPM Modi Idol unveilingSamathamurthy at Muchhinthaltelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment