రాజ్యాంగాన్ని మార్చాలనడం దేశంపై దాడిగా చూడాలి

  • కెసిఆర్‌ ‌మేక వన్నెపులి అని తేలింది
  • అవగాహన లేని వ్యక్తి సీఎంగా ఉండడం దురదృష్టకరం
  • అందరం ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : సిఎల్‌పి నేత భట్టి
  • గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ‌దీక్ష..కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ నేతలు
  • సీ•ఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి…మోదీ, కెసిఆర్‌ ఆలోచనా ధోరణలు కూడా ఒక్కటే : మల్లు రవి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాటలు దేశంపై దాడిగా చూడాలని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ప్రశ్నించే చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అని రాజ్యాంగం చెప్పిందని, ఇప్పుడు సీఎం ప్రకటనతో కేసీఆర్‌ ‌మేకవన్నె పులి అని తెలిపోయిందన్నారు. అందరం ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపిచ్చారు. సీఎం కేసీఆర్‌ ‌టక్కు టమార, గోకర్ణ మాయలతో దేశాన్ని మోసం చేస్తున్నారని, రాజ్యాంగంపై అవగాహన లేని కేసీఆర్‌ ‌సీఎంగా ఉండడం దురదృష్టకరని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ ‌గ్రామ స్థాయి ఫ్యూడల్‌ ‌నాయకుడిగా మాట్లాడారని విమర్శించారు. ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రకటనలను తాను ఏకీభవిస్తానన్నారు. దేశం, రాష్ట్రం రెండుగా విభజించే రోజులు దగ్గర పడ్డాయని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ద ప్రమాణం చేసిన వ్యక్తి మాట మార్చడం అనేది సరి కాదని సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తులు కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ద్వారానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కొత్త రాజ్యాంగం కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నట్లే కదా అని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 65 సార్లు హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కేసులు నిరూపించుకో అని కేసీఆర్‌కు పొన్నాల సవాల్‌ ‌విసిరారు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఈడీ అధికారులు కేసీఆర్‌ ‌దగ్గరకు వొచ్చారని ఆయన విమర్శించారు.

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ‌దీక్షలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. అసలు కొత్త రాజ్యాంగం ఎందుకో కేసీఆర్‌ ‌సమాధానం చెప్పాలని, నీ కుటుంబ సభ్యులు పాలించడానికేనా కొత్త రాజ్యాంగం అని ఆయన ఎద్దేవా చేశారు. నువ్వు పార్టీ పెట్టే ముందు తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడవా, నయీమ్‌ ‌కేసు ఏమయింది, ఇప్పటి వరకు ఇక్కడ వెలగపెట్టి..ఇప్పుడు దేశం గురించి మాట్లాడతావా..కేసీఆర్‌ ‌మాట్లాడిన మాటలు దేశ ద్రోహం, రాజ్యాంగ ధిక్కరణ కింద వొస్తాయి.. అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ‌రాజ్యంగం మార్చాలన్న మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, ‌ప్రధాని మోదీ వున్నారన్నారు. అమిత్‌ ‌షా దగ్గర పనిచేసేటోడు ప్రగతి భవన్‌లో పని చేస్తుండని..పీకేతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుకోడానికి దొరలు చూస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు బొంద పెట్టె రోజులు దగ్గర పడ్డాయన్నారు. 95 నుంచి 105 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చునని.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రెండు దొంగలేనని అద్దంకి దయాకర్‌ ‌విమర్శించారు. గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో అద్దంఇక మాట్లాడుతూ కెసిఆర్‌ ‌తీరును తూర్పారబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న సీఎం కేసీఆర్‌పై ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌ ‌మహేశ్వర్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు. దళిత అణగారిన ప్రజలని అణగతొక్కాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తో ఎవరు ఆమాటలు చెప్పించారో చెప్పాలని నిలదీశారు. ముందు నుంచి బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని.. కేసీఆర్‌ ‌శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండటానికి రాజ్యాంగం మార్చాలను కుంటున్నారని మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ దీక్షలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. కేసీఆర్‌ని బీజేపీ భయపెట్టి అ మాటలు మాట్లాడిస్తుందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొననారు.

కెసిఆర్‌ ‌వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి…మోడీ, కెసిఆర్‌ ఆలోచనా ధోరణలు కూడా ఒక్కటే : మల్లు రవి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ మల్లు రవి డిమాండ్‌ ‌చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని అనడం ద్వారా ఆయన అంబేడ్కర్‌ను అవమానించారని అన్నారు. గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షలో ఆయన గురువారం మాట్లాడుతూ..ఎందుకు రాజ్యాంగం మార్చాలో సీఎం కెసిఆర్‌ ‌వివరంగా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ ‌చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌ ‌లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ ‌పొరాటం చేస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని చెప్పడంతో గొప్ప మహానుభావుడు రాసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాయడమేనని అన్నారు.

దేశంలో మోదీ ప్రభుత్వం అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముందని అనడం చూస్తుంటే భారత రాజ్యాంగం విషయంలో మోదీ, కేసీఆర్‌ ఇద్దరు కూడా ఒకటేనని అర్థం అయ్యిందన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌రాజ్యాంగంపై చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్‌ అనర్హుడన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. లేనిచో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. మహాత్మాగాంధీ దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రపంచ దేశాల్లో శాంతి మానవత్వానికి మరో పేరుగా మహాత్మాగాంధీని అందరూ గుర్తిస్తారు. అలాంటి గాంధీని చంపిన గాఢ్సేకీ బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు కడుతుందన్నారు. ప్రపంచదేశాల ముందు నవ్వుల పాలు అవుతుందని ఎద్దేవా చేశారు.

prajatantra newstelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment