హైదరాబాద్ ఫిబ్రవరి 5
అందరూ ఊహించినట్టుగానే జరిగింది. కేసీఆర్ అనుకున్నంత పని చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్పై నిప్పు లు చెరిగిన కేసీఆర్.. మోడీపైనా విమర్శలు గుప్పించారు. కొన్నాళ్లుగా ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమ ర్శలు చేస్తున్న కేసీఆర్.. సమయం చూసుకుని మోడీకి షాకిచ్చారు. తాజాగా శనివారం మోడీ హైదరాబాద్ పర్యటనకు వవచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ కూడా మోడీ పర్యటనలో భాగంగా ఉండాలి. అయితే.. ఈ పర్యటనకు కేసీఆర్ డుమ్మా కొట్టారు.ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై సీఎస్ సోమేశ్కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే క్రమంలో ప్రొటోకాల్ ప్రకారం పీఎం వెంటే సీఎం ఉండాల్సి ఉంది. కానీ.. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నట్టు తెలిసింది.ఈ కారణంగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఒకవేళ.. కేసీఆర్కు జ్వరం తగ్గితే.. ముచ్చింతల్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ వాస్తవానికి శుక్రవారం వరకు కూడా ఆరోగ్యంగానే ఉన్న కేసీఆర్.. హఠాత్తుగా.. అనారోగ్యానికి గురికావడం వెనుక రాజకీయ రీజన్ తప్ప మరేమీ లేదని.. పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.నిన్నగాక మొన్న ప్రధానిని ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించింది.. ఆయన వెంట.. హెలికాప్టర్లో పర్యటనకు వెళ్తే.. రాజకీయంగా తనపై విమర్శలు రావడంతోపాటు.. అనేక అపవాదులు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుందనే ఆలోచన చేసి ఉంటారని..అందుకే కేసీఆర్ ప్రధాని పర్యటనకుడుమ్మా కొట్టారని అంటున్నారు. ఇదిలావుంటే.. పీఎం కార్యక్రమాలకు ప్రొటోకాల్ను అమలు చేసే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్కు అప్పగిస్తూ.. సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇప్పుడు.. సీఎం కేసీఆర్ పర్యటనే కేన్సిల్ అయింది. మరి దీనిని ఎలా చూస్తారో చూడాలి.