రాష్ట్రంలో తగ్గిన రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 2646 మందికి పాజిటివ్‌..‌ ముగ్గురు మృతి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 02: రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు తగ్గాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2646 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 2646 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్‌ ‌కారణంగా ముగ్గురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 747 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 177, రంగారెడ్డి జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,69,407 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,094కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,30,648 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 34,665గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Comments (0)
Add Comment