పేద ప్రజల కళ్ళల్లో సంతోషం నింపే వరకు విశ్రమించం

  • వారు ఆత్మగౌరవంతో బతికేందుకే ‘డబుల్‌’ ఇళ్లు
  • దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలు.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి : పేదవాడు ఆత్మగౌరవంతో నివసించేలా ఇళ్లు ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశంతోనే రాష్ట్రంలో18 వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల 72000 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు నిర్మించామని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ ‌పరిపాలన శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, కోడుగల్‌ ‌గ్రామంలో సుమారు రెండు కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన (40) రెండు పడకల గదులను ఆయన ప్రారంభించారు. రైతు వేదికను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. గతంలో ఇల్లు అంటే అగ్గిపెట్టె సైజులో ఉండేవని, అందులోనే కుటుంబ సభ్యులందరూ బ్రతకాల్సి వొచ్చేదని, అలా కాకుండా తమ ప్రభుత్వం డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లు ఖర్చు చేసి 2 లక్షల 70 వేల ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్నో అద్భుత పథకాలను అమలు చేస్తున్నామని, ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చి తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామంలో రోడ్లు, చెట్లు, పారిశుద్ధ్యం, రైతు వేదిక, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు, ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌ ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి నెలా గ్రామపంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయడం, ప్రతి పల్లెటూర్లో పట్నంలో లాగా ఆట స్థలాలు ఏర్పాటు చేసి గ్రామాలకు నిజమైన గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామని అన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పల్లెటూర్లు ఉన్నాయని, రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలలో నర్సరీ, ట్రాక్టర్‌, ‌ట్యాంకర్లు ఉన్నాయని, ప్రతి ఊరికి ముందు చెట్లు స్వాగతం పలుకుతున్నాయని, మిషన్‌ ‌భగీరథ తాగునీరు, టాయిలెట్లు, రైతుబంధు, రైతు వేదిక వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా, 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, గతంలో నాలుగు దఫాలుగా విద్యుత్‌ ఇచ్చేవారని, తెలంగాణలో లాగా ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదని, 200 రూపాయల పెన్షన్‌ను 2000 రూపాయలకు పెంచామని, పెద్దల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు కృషిచేస్తున్నామని, కల్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేశామని, కెసిఆర్‌ ‌కిట్టు ద్వారా ప్రభుత్వ హాస్పిటళ్లలో కాన్పులు 50 శాతం పెరిగాయని, మాతాశిశు మరణాలు తగ్గాయని, వైద్యరంగం బాగా ఉందని, ప్రతి ఇంటికి మిషన్‌ ‌భగీరథ తాగునీటిని ఇస్తున్నామని, ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ ‌వల్ల రెండు లక్షల మంది జీవచ్ఛవంగా మారారని, తాము తెచ్చిన మిషన్‌ ‌భగీరథ నీటి వల్ల నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ ‌పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాయని, సన్న బియ్యంతో దళిత, గిరిజన, గిరిజన వెనుకబడిన వారికి పిల్లలకు హాస్టల్లో భోజనం ఏర్పాటు చేశామని, 1000 గురుకులాలు ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల పిల్లల తో పోటీ పడే లాగా చదివిస్తున్నామని, 16 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్‌ ఇచ్చామని ,అంబేద్కర్‌ ఓవర్‌ ‌సీస్‌ ‌విధ్యానిది కింద 20 లక్షలు, జ్యోతిబాపూలే విద్య నిధి కింద 20 లక్షల అందిస్తున్నామని, ఇలాంటి అద్భుత పథకాలు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా కల్పిస్తామని ఇవ్వలేదని, ఐటీ కారిడార్‌ ‌కోరినప్పటికీ రాష్ట్రానికి ఇవ్వలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వనరులతో నిర్విఘ్నంగా ముందుకు వెళుతున్నదని ,పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని,పేద ప్రజల కళ్ళల్లో సంతోశం కలిగే వరకు విశ్రమించబోమని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి .శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని ,తాగు నీరు, విద్యుత్తు, రైతు వేదిక, రైతుబంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఇలాంటి వాటి తో పాటు, ఇటీవల అమలు చేస్తున్న దళిత బంధు ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని , రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్‌ ‌సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు గ్రామాలను, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అంతేకాక స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ అన్ని అంశాలలో నిర్లక్ష్యం వహించారని, తమ ప్రభుత్వం పార్టీలకతీతంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, జడ్చర్ల నియోజకవర్గంలో 2000 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు నిర్మిస్తుండగా జడ్చర్ల పట్టణంలో వెయ్యి, గ్రామీణ ప్రాంతంలో మరో వెయ్యేళ్ల ను నిర్మించినట్లు తెలిపారు.

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు రాని పేదలందరికీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ,అదేవిధంగా ఎవరికైనా సొంత స్థలాలు ఉంటే డబల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు . రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌స్వర్ణ సుధాకర్‌ ‌రెడ్డి ,జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌కోడుగల్‌ ‌యాదయ్య, ప్రభుత్వ విప్‌, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ,దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట రావు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ‌తేజస్‌ ‌నందలాల్‌ ‌పవర్‌, ‌డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌ప్రభాకర్‌ ‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ ‌హైమావతి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రణీల్‌ ‌చంద్ర, తదితరులు హాజరయ్యారు.

Best Schemes in Telangana IT minister KTRimplementedit minister ktrprajatantra newsSchemestelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment