*హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్, వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం , మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు ఉన్నారు.*