షాద్నగర్ వాసవి మాత దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు పార్వతి అమ్మవారి అలంకరణలో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని ఈ సమయంలో అమ్మవారు మహిమాన్వితమైన అపార శక్తి కలిగి ఉంటారని ఆర్యవైశ్య మహిళ అందరము కలిసి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు

Comments (0)
Add Comment