ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీలకు సంభందించి శుక్రవారం సాయంత్రం బషీర్ బాగ్ లోని మంత్రి చాంబర్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మరియు ఇతర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు.ఈ నెల 27 నుంచి దీనికి సంభందించిన ప్రక్రియను ప్రారంభించాలని, మరియు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.