హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.