ఖమ్మం కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు

*ఖమ్మం కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు*

ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ఈసీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు.

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని భావించారు. ఆ తర్వాత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఇందులో భాగంగానే ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నయా కలెక్టరేట్‌ను నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్‌, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్‌ రూపుదిద్దుకున్నది.

Comments (0)
Add Comment