కొమురవెల్లి మల్లన్న జాతరకు తరలివస్తున్న భక్తజనం

*కొమురవెల్లి మల్లన్న జాతరకు తరలివస్తున్న భక్తజనం*
*శనివారం రాత్రి ఆలయ రాజగోపురం* *ఎదుట భక్తుల రద్దీ*
*చేర్యాల, న్యూస్‌టుడే*: *మూడు నెలల పాటు జరిగే ‘మల్లన్న’ జాతర ఆదివారం షురూ కానుంది*.

శనివారం మధ్యాహ్నం నుంచే భక్తుల రాక ఆరంభమైంది. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడే గుడారాలు వేసుకొని విడిది చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు సైతం శనివారం రాత్రి నుంచే తెరిచారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో బాలాజీ, పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి తెలిపారు. క్యూలైన్లలో నీటి వసతితోపాటు తాత్కాలిక శౌచాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనపు డీసీపీ సందెపోగు మహేందర్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ ఏసీపీ ఫణిందర్‌, సీఐ రామకృష్ణ, చేర్యాల సీఐ శ్రీనివాస్‌, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్‌తో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Comments (0)
Add Comment