ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించి సోమవారం వేములవాడకు వెళ్లి అక్కడే వివాహం చేసుకుని, మంగళవారం మధ్యాహ్నం హుజూరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో యువతి బంధువులు ఆ వరుడిపై పగబట్టారు. యువకుడు అద్దెకు ఉంటున్న ఇంటిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కొత్తకొండకు చెందిన రాజశేఖర్ కుటుంబం రెండేళ్లుగా హుజూరాబాద్ ఇందిరానగర్ కాలనీలో నివాసముంటోంది. పెయింటింగ్ పని చేసే రాజశేఖర్ ఇంటి పక్కనుండే సంజన అనే యువతి ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించి సోమవారం వేములవాడకు వెళ్లి అక్కడే వివాహం చేసుకుని, మంగళవారం మధ్యాహ్నం హుజూరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు విషయాన్ని సంజన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.