యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో కైలాసపుర శ్రీ రేణుక బసవలింగేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ్యవస్థాపకులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు కూర్మా ద్వాదశి సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు, నిర్వహించి, అనంతరం ముత్తైదులకు చీరలు పంపిణీ చేసారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు సిద్దిపేట వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త గౌరీశెట్టి ఆంజనేయులు ( కాశి యాత్ర ) మరియు వారి కుమారుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ నివాసి బైరి ప్రభాకర్, అలైక్య,ప్రొఫెసర్. ఏం శ్రీధర్ రెడ్డి, శుశ్రీత, పద్మ, పందిరి శ్రీనివాస్ రావు, విజయ దుర్గ, రఘు,లక్షిత మనోరంజన్ నిత్య, తదితరులు పాలొగొన్నారు.