సూర్యాపేట: తల్లిదండ్రులు కోల్పోయిన యువతిని చేరదీసిన బాబాయ్ పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. గర్భం దాల్చిన యువతిని పెద్దనాన్న కుమారుడు కూడా వేధించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నది.
ఈ ఘటన నేరేడుచర్ల మండలం పత్తేపురంలో చోటు చేసుకున్నది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం యువతి బంధువులకు తెలియడంతో హుటాహుటిన బాబాయ్ ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతదేహం అప్పగించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు.