ముంబై: తాలిబన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్ రావడంతో జనాలు పునరాలోచనలో పడుతున్నారు. చైనా, రష్యా మినహా మిగతా దేశాలు ఆ దేశంతో సఖ్యంగా ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆ దేశస్తులతో వివాహాలు చేసుకునేందుకు కూడా వెనకంజ వేస్తున్నారు.
తాజాగా నటీమణి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్షిఖాన్ కూడా తన ఎంగేజిమెంట్ ను రద్దు చేసుకున్నది. రానున్న అక్టోబర్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ తో ఎంగేజిమెంట్ కావాల్సి ఉండగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వరుడిని పెళ్లి చేసుకునేది లేదని, ఇండియా వ్యక్తినే వివాహం చేసుకుంటానని అర్షిఖాన్ మీడియాకు తెలిపింది. మా నాన్న స్నేహితుడి కుమారుడు, క్రికెటర్ తో తన పెళ్లి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ లో ఎంగేజిమెంట్ కావాల్సి ఉంది. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించడంతో రద్దు చేసుకున్నాం. ఈ నిర్ణయంతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవిత భాగస్వామి తప్పకుండా ఇండియన్ అవుతాడని ఆమె చెప్పింది. అర్షిఖాన్ బిగ్ బాస్ సీజన్ 11 లో పాల్గొన్నారు. 14వ సీజన్ లో ఛాలెంజర్ గా షో లో ప్రవేశించారు. సావిత్రి దేవి కాలేజి అండ్ హాస్పిటల్, విష్, ఇష్క్ మే మార్జవాన్ వంటి టివి షోలతో పాటు మ్యూజిక్ వీడియోలు చేశారు.