ఉద్వేగానికి లోనైన మంత్రి హరీష్ రావు

కరోనా కాలంలో చోటు చేసుకున్న ఘటనలు తలుచుకున్న మంత్రి
సిద్దిపేట, ఫిబ్రవరి 16: హరీష్ రావు ఉద్వేగానికి లోనయ్యారు. కరోనా కాలంలో చోటు చేసుకున్న ఘటనలు, తన అనుభవాలను నెమరు వేసుకున్న ఆయన కన్నీరు పెట్టుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. కరోనా సంక్షోభ సమయంలో జరిగిన తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. కళ్లనిండా చూసిన అనుభవాలు చెప్తూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ”రామయంపేట్ సీఐ నందీశ్వర్ గౌడ్.. అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలి, హైదరాబాద్ నుండి తూప్రాన్ మీదగా రామాయంపేట్ 80 కిలోమీటర్లు మహిళ నడుచుకుంటూ వెళ్తుందని, ఆరు ఏడు నెలల గర్భవతి అని, అరవై డెబ్భై కిలోమీటర్లు నడవడం వల్ల రక్తస్రావం అయిందని, ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు.

అయితే నాకు ఫోన్ చేసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం చేర్చాలని కోరాడు. నేను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరిండెంట్‌కు ఫోన్ చేసి అరగంటలో అంబులెన్స్‌లో మధ్యప్రదేశ్ చెందిన మహిళను సిద్దిపేట ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడగలిగాము. మరుసటి రోజు మధ్యప్రదేశ్ సీఎం కార్యాలయం నుండి తనకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మహిళను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు, తాను స్వయంగా అంబులెన్స్‌లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెదిన ఆ మహిళను సురక్షితంగా ఆమె స్వగ్రామానికి చేర్చామన్నారు.” మంత్రి హరీష్ రావు. ఈ ఘటనలను తలుచుకుంటూ మంత్రి హరీష్ రావు ఉద్వేగానికి లోనయ్యారు.

areanews appcorona pandamicemotionalharish raoMinister Harish Rao emotional
Comments (0)
Add Comment