న్యూఢిల్లీ: చైనా దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివో ఎక్స్ 60 ఫోన్ పై సరాసరి రూ.3వేలు తగ్గించింది.
తగ్గించిన ధరతో వివో ఎక్స్ 60 స్మార్ట్ ఫోన్ రూ.34,990కే మార్కెట్ లో లభ్యం అవుతుంది. లాంఛ్ చేసిన సమయంలో 8జిబి ర్యామ్ తో ఉన్న ఈ ఫఓన్ ధర రూ.37,990 ఉంది. 6.56 అంగుళాలతో ఫుల్ హెచ్.డి డిస్ ప్లే తో, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870, 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజీ ఉండగా 13 మెగా పిక్సెల్ సెన్సార్, 13 మెగా పికెస్ సెల్ఫీ షూటర్ ఉంది.