హైదరాబాద్: సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసును నాటకమని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్ళి రేప్ చేసారంటూ యువతి డ్రామా ఆడిందని నిర్థారణకు వచ్చారు.
తనపై ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు అత్యాచారం చేశారని యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సిసిటివి ఫుటేజ్ పరిశీలించారు. ఆమెను కిడ్నప్ చేసి అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు లభించకపోవడంతో కట్టుకథగా తేల్చారు. తను ప్రేమించిన ప్రియడికి వివాహం నిశ్చయం కావడంతో ఈ కేసులో అతన్ని ఇరికెందుకు యువతి ఆడిన డ్రామాగా పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది.