న్యూఢిల్లీ: ఇంకా కొన్ని రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా థర్డ్ వేవ్ పై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడిఎం) నిపుణుల కమిటీ ప్రధాని కార్యాలయానికి నివేదిక పంపించింది.
థర్డ్ వేవ్ లో ప్రధానంగా చిన్నారులపై కరోనా వైరస్ పంజా విసురుతుందని, మందులు, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఎన్ఐడిఎం అప్రమత్తం చేసింది. ఇప్పుడున్న సౌకర్యాలు ఏమాత్రం సరిపోవని, అదనంగా ఏర్పాట్లు చేస్తే తప్ప గండం నుంచి గట్టెక్కడం అసాధ్యమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. చిన్నారుల కోసం వెంటిలేటర్లు, అంబూలెన్స్ సంఖ్య పెంచాలని సూచించింది. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 82శాతం శిశు వైద్యుల కొరత ఉందని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్న్లు ఎన్ఐడిఎం పేర్కొంది. థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈలోపు ఖాళీలు భర్తీ చేయాలని కేంద్రాన్ని సూచించింది.