కాబూల్: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత ప్రజల్లో అలజడి మొదలైంది. ఇస్లామిక్ రాజ్యం స్థాపన దిశగా తాలిబన్లు అడుగులు వేస్తారని భావించిన జనం ప్రాణభయంతో ఇతరదేశాలకు పరుగులు పెడుతున్నారు.
బతికితే చాలు అనే విధంగా అందుబాటులో ఉన్న ఏ రవాణా వ్యవస్థను వారు వదులుకోవడం లేదు. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరుగుతున్న పోరులో సాధారణ ప్రజలు సమిధలు అవుతున్నారు. మళ్లీ పాతరోజులు పునరావృతం అవుతాయని భావించిన ప్రజలు రైలు, బస్సు, విమానంతో పాటు ఏ వాహనం లో చోటు దొరికినా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. విమానాశ్రయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం నాడు కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా దేశానికి చెందిన కార్గో విమానం ఎగిరింది. ఈ విమానంలోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఎలాగైలా బయటపడాలనే లక్ష్యంతో టర్మాక్ పై కూర్చున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విమానం ఖతార్ లోని ఏయిర్ బేస్ లో చేరుకున్నది. విమానం చేరుకున్న తరువాత దాన్ని చూసిన వైమానిక దళ అధికారులు షాక్ చెందారు. విమానం టైర్ల చుట్టు పక్కల మానవ శరీర భాగాలు, అవయాలు కన్పించడంతో భయాందోళనకు గురయ్యారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల విచారణ చేస్తున్నామని అమెరికా వైమానిక దళం ప్రకటించింది.