యాదాద్రి భువనగిరి జిల్లా క్యాసారం ( కైలాస పురం) లో సోమవారం కార్తీక చతుర్దశి సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు,అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి దంపతుల ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని తులసి చెట్టు ఉసిరి చెట్టుకు ప్రదక్షణ చేసి దీపాలు వెలిగించి అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈసందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసమని శివునికి అత్యంత ప్రీతికరమైన మాసంలో దీపాలు వెలిగించి పుణ్యఫలం పొందాలని చీకట్లను పారదో లేది దీపం అని కార్తీక మాసం లో ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి దేవతలని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అని అన్నారు ఈకార్యక్రమంలో పెద్ద యెత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు