ప్రమాదాలకు నిలయంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రోడ్లు

ఎస్ఎన్ తెలుగు న్యూస్ – సూర్యాపేట జిల్లా వార్తలు : సూర్యాపేట జిల్లా కేంద్రం అయ్యాక పట్టణంలో పాదాచారులు, వాహనదారులు రద్దీ రోజురోజుకు పెరిగిపోతుండగా రహదారులు మాత్రం రోజు రోజుకి దారుణ స్థితికి మారుతున్నాయి సౌకర్యమంతమైన రహదారులు లేవు మరి ముఖ్యంగా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ఏరియాలో రోడ్లు దారుణంగా మారి పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి రద్దీ అధికంగా లేని రోడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి నిత్యము రద్దీగా ప్రజలు తిరుగుతున్న రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి మొన్న దసరా పండుగ సందర్భంగా పి.ఎస్.ఆర్ సెంటర్ నుండి జమ్మిగడ్డ వరకు గుంతల రోడ్డు మట్టి ద్వారా ప్యాచ్లు వేశారు కానీ ఈ వానకి మళ్లీ యధావిధిస్తాయికి గుంతలు ఏర్పడ్డాయి పోస్ట్ ఆఫీస్ నుండి PSR సెంటర్ వరకు ఉన్న రోడ్డు కేసులో ఉన్న కారణంగా అధికారులు తొందరగా స్పందించి ప్రజల అవసరాలను తీర్చగలరనీ ఉన్నతాధికారులు స్పందించి సూర్యాపేట ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు నిర్మించి రోడ్ల సమస్యలను పరిష్కరించి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రాష్ట్రములో సూర్యాపేట జిల్లాలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేలా అందరూ సహకరించాలని పట్టణ ప్రజలు కోరారు

ఎస్ ఎన్ తెలుగు వార్తలు
Comments (0)
Add Comment