యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో బుధవారం దసరా వేడుకలు చాలా ఘనంగా జరిగాయి గ్రామ ప్రజలందరూ పిల్లాపాపలతో సమీప చెట్టు వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో శమీ పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ దసరా వేడుకలు మొదలై ఇప్పటికీ 412 ఏళ్లు అవుతున్నాయని ఈ వేడుకలు 14వ శతాబ్దంలో మొదలయ్యాయని దేశంలోని దసరా సంబరాలకు మూలం విజయనగర రాజులుగా పేర్కొన్నారు దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకమైన వని దేశంలో పలు గ్రామాలలోని వీధులన్నీ దుర్గాదేవి మండపాలతో కలకలలాడుతూ ఉంటాయని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజిస్తారని పదవరోజు శ్రావణ దహనంతో ఈ వేడుకలు మి న్నంటూతాయని ఇలా ఏటా ఘనంగా వేడుకలు జరుపుకునే ఆచారం మన హిందువులకు ఎంతో గర్వకారణం అని మనం ఇప్పుడు దసరా అని పిలుచుకుంటున్న దసరాను పాతకాలంలో మహానవమిగా చేసుకునే వాళ్ళని తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి మరియు ఎంపీటీసీ ఎడ్ల సుగుణ రామిరెడ్డి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు