ఊరూ వాడకు సంక్రాంతి కొత్త సందడి తెచ్చింది. తరలివచ్చిన బంధువులు.. ముత్యాల ముగ్గులు తీర్చిన ముంగిళ్లు.. అమ్మ చేతి కమ్మనైన రుచులు.. ఆలయాల్లో పూజలు.. హరిదాసుల కీర్తనలు.. ఆకసాన ఎగిరిన పతంగులు.. హైహైరా అంటూ జోడెడ్ల పోటీలు.. ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఎన్నని చెప్పాలి.. సంక్రాంతి సందళ్లు. ఊరంతా పండగ.. మనసంతా నిండుగా అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా వాసుల ప్రతి హృదయం ఉప్పొంగింది.