పితృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గురువారం పరామర్శించారు. కరీంనగర్ లోని మంత్రి గంగుల నివాసానికి వెళ్ళి ఆయన తండ్రి గంగుల మల్లయ్య పార్థివ దేహానికి మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.