కాచారం దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపుర శ్రీ రేణుక వాసవి బసవ లింగేశ్వర దేవస్థానమ్లో అత్యంత వైభవంగా విశేష పూజా కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు సిద్దిపేట వాస్తవ్యులు గౌరీశెట్టి ఆంజనేయులు గుప్తా కాశీ యాత్ర వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పూజా కార్యక్రమాలకు విచ్చేసిన పలువురు ప్రముఖులను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ వాస్తవ్యులు బిల్లకంటి జగదీష్ గుప్తా హైదరాబాద్ బాలాజీ నగర్ రేణుక ముత్యాలమ్మ పోచమ్మ తల్లి దేవస్థానాల చైర్మన్ కత్తి చంద్రయ్య తెలంగాణ రాష్ట్ర దేవాలయాల వర్తక సంఘం అధ్యక్షులు తడక వెంకటేష్ ఆర్య వైశ్య సంఘం నాయకులు ఎలకంటి బాలేశ్వర్ గుప్తా మరియు తుడుపునూరు రమేష్ గుప్తా సివిల్ ఇంజనీర్ పాపిశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఎస్ ఎన్ తెలుగు వార్తలు
Comments (0)
Add Comment