తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు
గతంలో కేసీఆర్ ఏపీ వాళ్ళను తిట్టారు బీ ఆర్ ఎస్ లో చేరడానికి క్యాబుల ద్వారా నేతలను రప్పించారని ప్రైవేటీకరణ పై మాట్లాడుతున్న కేసీఆర్ ఆర్టీసీని ఎందుకు ప్రైవేటుకరిస్తున్నారు అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు లేడు కనీసం తెలంగాణకు కూడా అధ్యక్షుడు లేడు కానీ ఏపీకి మాత్రం అధ్యక్ష పదవి ఇచ్చారు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరో కేసీఆర్ చెప్పాలన్నారు ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు
ఆంధ్ర బిర్యాని పెండ బిర్యాని అని తిట్టావు కదా కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్తో రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు
అసలు పోలవరంపై నీ స్టాండ్ ఏంటో తెలియజేయగలవా అంటూ ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడాన్ని తట్టుకోలేకనే సెంటిమెంటు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు