అహ్మదాబాద్: చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య ప్రకటన చేశారు.
చిన్నారుల కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ఆయన మీడియాకు చెప్పారు. ఇవాళ రాజ్ కోట్ లో మీడియాతో మాట్లాడుతూ, భారత్ బయోటెక్, క్యాడిలా అభివృద్ధి చేసిన చిన్నారుల వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాలు వచ్చే నెలలో రానున్నాయన్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే చిన్నారులకు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. దేశంలో కరోనా ప్రభలకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసినట్లు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని ఆయన అన్నారు.