పాతిక వేలకే నాజూకైన ల్యాప్ టాప్

Infinix India is Budget Price Laptop ఇన్ఫినిక్స్ ఇండియా బడ్జెట్ ధరలో ల్యాప్ టాప్ విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్ 1 నియో పేరుతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ ధర రూ.24,990. మంచి పనితీరుతో కూడిన అనుభవాన్ని ఇస్తుందని, ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ బరువు 1.24 కిలోలు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్వాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది.

విద్యార్థుల టాస్క్ లను ఈ ల్యాప్ టాప్ సాఫీగా చేస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటల్ బాడీ తో దీన్ని తయారు చేశారు. కాస్మిక్ బ్లూ, స్టార్ ఫాల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 21 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు మొదలవుతాయి. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొంటే తగ్గింపు లభిస్తుంది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాప్ టాప్ తయారు చేసినప్పటికీ, ఇతరుల అవసరాలను కూడా తీర్చే సరిపడా సామర్థ్యాలు ఉన్నాయి.
Infinix Inbook X1 Neo, Intel Celeron Quad Core, processor, students laptop

Infinix Inbook X1 NeoIntel Celeron Quad Coreprocessorstudents laptop
Comments (0)
Add Comment