సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ

హైదరాబాద్: సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సజ్జనార్ (1996) స్థానంలో స్టిఫెన్ రవీంద్రను (1999) కొత్త పోలీస్ కమిషనర్ గా నియమించింది. మూడు సంవత్సరాల క్రితం సజ్జనార్ ను సైబరాబాద్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అంతకు ముందు వరంగల్ లో యువతిపై యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్ తో గుర్తింపు పొందారు. దిశా ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిషన్ ను నియమించింది. బాధితులు, సాక్షుల విచారణ కొనసాగుతున్నది.

ap latest newscyberabad police commissonerDGP Mahender Reddyhyderabad policeIps sajjanarips stephen ravindra
Comments (0)
Add Comment