త‌ప్పుడు వార్త‌లు రాసే వెబ్ సైట్లపై చ‌ర్య‌లు.. పార్ల‌మెంటు ముందుకు రానున్న కొత్త చ‌ట్టం!

దేశంలో డిజిట‌ల్ మీడియాకు ప్రస్తుతం ప‌రిమితుల‌న్న మాటే లేదు. ఏ వార్త రాసినా, ఏ వీడియో ప్ర‌సారం చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఆయా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల విశ్వ‌స‌నీయ‌త‌నూ ప్ర‌శ్నించే వ్య‌వ‌స్థ లేదు. ఫ‌లితంగా కొన్ని డిజిట‌ల్ మీడియా సంస్థ‌లు ఇష్టానుసారంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. ఇక‌పై ఈ త‌ర‌హా య‌త్నాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌నుంది. ఈ దిశగా కేంద్ర ప్ర‌భుత్వం ఓ కొత్త చ‌ట్టానికి తుది మెరుగులు దిద్దుతోంది. అంతా అనుకున్న‌ట్లు జరిగితే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే ఈ బిల్లు పార్ల‌మెంటు ముందుకు రానుంది.

ఈ కొత్త బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొందితే ఆ వెంట‌నే చ‌ట్టంగా మార‌నుంది. ఫ‌లితంగా డిజిట‌ల్ మీడియా కూడా చ‌ట్టం ప‌రిధిలోకి రానుంది. ఈ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందాక త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసే డిజిట‌ల్ న్యూస్ సైట్ల‌ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు కావ‌డంతో పాటుగా ఆయా సైట్ల‌పై జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంది. ఈ బిల్లు చ‌ట్టంగా మారితే.. ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వ రెగ్యులేష‌న్ ప‌రిధిలో లేని డిజిట‌ల్ న్యూస్ ఇక‌పై మీడియా రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం ప‌రిధిలోకి రానుంది.
Digital Media, Parliament, Digital News

Digital MediaDigital NewsParliament
Comments (0)
Add Comment