వాట్సప్ గ్రూపులో రిమూవ్ చేసినందుకు నాలిక కోసిన ఉన్మాది

మహారాష్ట్ర/పూణే: వాట్సప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడనే కోపంతో అడ్మిన్‌ను చితకబాది, నాలుకను కోసేశారు అయిదుగురు వ్యక్తులు. మహారాష్ట్రలోని పుణెలో డిసెంబరు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణె నగరం ఫుర్సుంగిలోని ఓ హౌసింగ్‌ సొసైటీలో బాధితుడు(గ్రూప్‌ అడ్మిన్‌), నిందితులు నివసిస్తుంటారు. బాధితుడు హౌసింగ్‌ సొసైటీ సమాచారం కోసం ‘ఓం హైట్స్‌ ఆపరేషన్‌’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. అందులో ఆ సొసైటీ సభ్యులందరూ ఉన్నారు. అయితే గ్రూప్‌ నుంచి ఇటీవల ఓ వ్యక్తిని తొలగించాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్మిన్‌కు మెసేజ్‌ చేశాడు. అడ్మిన్‌ స్పందించకపోవడంతో నిందితుడు ఫోన్‌ చేసి కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మరో నలుగురితో కలిసి అడ్మిన్‌ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అందరూ కలిసి అతడిపై దాడి చేయడంతో పాటు నాలుక కోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నాలుకకు కుట్లు వేశారు. అడ్మిన్‌ భార్య ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments (0)
Add Comment