భక్త బృందంతో మావురాల ఎల్లమ్మ తల్లి దర్శనార్థం బయలుదేరిన అంజయ్య స్వామి

మహారాష్ట్రలోని ఎల్లమ్మ తల్లి జన్మస్థలమైన మావురాలలోని శక్తిపీఠ స్వయంభు అమ్మవారి ఆశ్వీయుజ మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలపై కాచారం కైలాసపుర శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో గురువారం సాయంత్రం భక్తబృందం తో కలిసి బయలుదేరారు ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి జన్మస్థలం అయినటువంటి మహారాష్ట్ర సిరొంచి దగ్గరలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మావురాల లో స్వయంగా నిలిచిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించిన యెడల సకల పాపాలు తొలగి అన్ని కార్యాలయంలో విజయులవుదురని లక్ష్మి కటాక్షం కలుగునని ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది కృపకు పాత్రులు కాగలరని తెలిపారు తీర్థయాత్రలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రేణుక ఎల్లమ్మ తల్లి వ్యవస్థాపకులు అంజయ్య స్వామి వారితో మా యొక్క బృందం అమ్మవారి ఆశీర్వాదం కోసం వెళ్లడం మాకెంతో అదృష్టమని ఇంతటి మహాభాగ్యం కలగడం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండడం వల్లనే జరుగుతుందని సంతోషం వ్యక్తపరిచారు
ముఖ్యంగా మా యాత్ర ప్రారంభం కావడానికి ముందు యాదగిరిగుట్టలోని పలువురు ఆర్యవైశ్య నాయకులు మేము రాలేకపోతున్న కూడా అమ్మవారి ఆశీర్వాదం మీ ద్వారా మాకు కలగాలని భక్త బృందాన్ని జేజేలు పలుకుతూ యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి రావాలని తెలపడం ఆంజనేయ స్వామి వారి గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య నాయకులు ఎలికంటి బాలేష్ లంకలపల్లి శ్రీనివాస్ పోకల పాండు ఉప్పగల నరసింహులు మరియు వారి సోదరులు మరియు ఆలేరు పట్టణ కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు సముద్రాల కుమార్ గుప్త సముద్రాల రవి సముద్రాల శీను ఐతా వెంకటేశ్వర్లు మరియు ఐడియా శ్రీనివాస్ స్వరాభి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

ఎస్ ఎన్ తెలుగు వార్తలు
Comments (0)
Add Comment