ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్

ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మిస్తూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో ప‌ని చేయాల్సిన వ్య‌క్తి అని తెలిపారు. పార్థ‌సార‌థి సేవ‌లు కూడా ఉప‌యోగించుకుంటాం. ఇవాళ మాకు మంచి వ‌జ్రాలు దొరికాయ‌ని భావిస్తున్నాను. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా మంచి ప‌నిని చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కేసీఆర్ తెలిపారు.

వీరి చేరిక‌ల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌సంగించారు. తోట చంద్ర‌శేఖ‌ర్ వారి క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో పూర్తిగా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. నాకు సంపూర్ణ‌మైన విశ్వాసం ఉంది. వారు విజ‌యం సాధిస్తారు అని సంక్రాంతి మ‌రునాడు నుంచి త‌ట్టుకోలేనంత ఒత్తిడి వ‌స్తుంది. వండ‌ర్‌ఫుల్‌గా మ‌నం పురోగ‌మించే అవ‌కాశం ఉందన్నారు . ఆశ్చ‌ర్య‌ప‌రిచే చేరిక‌లు త్వ‌ర‌లోనే ఉంటాయి. నిన్న చాలాసేపు మాట్లాడం. ఒక పంథా వేసుకున్నాం. ఆ దిశ‌గా పురోగ‌మించేందుకు జాతీయ‌స్థాయిలో కిశోర్ ప‌ని చేస్తారు. చాలా గొప్ప‌వారు కూడా ఫోన్లు చేశారు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు సిట్టింగ్ క‌దా అని అడిగితే మేం ఫిట్టింగ్ లేమ‌ని చెబుతున్నారు. ఏపీలో పార్టీ బ‌రువు, బాధ్య‌త చంద్ర‌శేఖ‌ర్‌పై ఉంటుంది. వారికి ప‌రిపాల‌న అనుభ‌వం ఉంది. అవ‌కాశం క‌లిగింది అని కేసీఆర్ పేర్కొన్నారు.

Comments (0)
Add Comment