బీజేపీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు జరుగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరిని మంత్రి పదవి వరించనుంది.తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి మండలిలో అవకాశం కల్పించే దిశగా మోడీ అడుగులు వేస్తున్నట్లు బిజెపి వర్గాల సమాచారం. తెలంగాణ నుంచి లోకసభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఆదిలాబాద్ జిల్లా నుంచి సోయం బాబూరావు మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరే గాకుండా ఇంకా మంత్రి పదవి రేసులో ఎవరు ఉన్నారో వేచి చూడాలి.