సర్కార్ వారి పాట ఫ‌స్ట్‌ సింగిల్ కళావతి నుండి సరికొత్త పోస్టర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు. కళావతి అనే పాట ఈ సంవత్సరం మెలోడీ సాంగ్‌గా ఉండబోతోంది.

ఇది మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపుతుంది. మేకర్స్ ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో మహేష్ బాబు నిజంగా ప్రిన్స్‌గా కనిపిస్తున్నాడు. అతను ట్రెండీ వేషధారణలో అంగరంగ వైభవంగా ఉన్నాడు, కీర్తి సురేష్ మెరిసే చీరలో అందంగా ఉంది. ప్రజలారా, ఎస్ తమన్ అందించిన ఈ మ్యాజికల్ నంబర్‌తో ప్రేమలో పడండి. మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో మహేష్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాడు పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహేష్ బాబుకు జంట‌గా నటిస్తోంది. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. సర్కార వారి పాట మే 12న వేసవి ఆకర్షణగా రాబోతోంది. తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

area news appkeerthi sureshkeerthi suresh as kalavathiposter unveiledSarkaru Vaari Paata
Comments (0)
Add Comment