టాలీవుడ్ లో కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతోంది. సహజనటి జయసుధ కూడా కరోనా బారినపడ్డారు. కొంతకాలంగా జయసుధ అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి ఆమె చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే ఆమెకు కరోనా సోకిందన్న వార్తతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయసుధ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జయసుధ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం.
గతంలో రాజకీయాల్లో చురుగ్గా కొనసాగిన జయసుధ కొంతకాలంగా వాటికి దూరంగా ఉన్నారు. పైగా సినిమాల నుంచి కూడా ఆమె విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Tags: Jayasudha, Corona Virus, Positive, USA, Tollywood